Balayya : అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ

ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ... వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ ఇచ్చాడు. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ టీడీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో సభలో నినాదాలు చేశారు. జై డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. అలాగే... వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టారు టీడ

Balayya : అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ
X

Balayya : ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ... వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ ఇచ్చాడు. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ టీడీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో సభలో నినాదాలు చేశారు. జై డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. అలాగే... వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు. అక్కడితో ఆగకుండా... స్పీకర్ పోడియం ఎక్కి నినాదాలు చేశారు. స్పీకర్ పై కాగితాలు చల్లారు టీడీపీ సభ్యులు.

ఈ తరుణంలోనే... అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ... వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ ఇచ్చాడు. అయితే... అసెంబ్లీలో మీసాలు తిప్పిన బాలకృష్ణ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. దమ్ముంటే రా అంటూ అంబటి రాంబాబు సవాల్‌ విసిరారు. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు అంబటి కౌంటర్‌ ఇచ్చారు. ఇక అటు టీడీపీ సభ్యులతో కలిసి పోడియం ఎక్కి ఆందోళన చేసింది ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. దీంతో అసెంబ్లీని వాయిదా వేశారు స్పీకర్‌.

Tags:
Next Story
Share it