Bandi Sanjay : ఇవాళ ఎంపీ పదవికి బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరి కాసేపట్లో విజయవాడకు బయలుదేరనున్నారు.

Bandi Sanjay  :  ఇవాళ ఎంపీ పదవికి బండి సంజయ్
X

Bandi Sanjay : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరి కాసేపట్లో విజయవాడకు బయలుదేరనున్నారు. రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి గన్నవరం వెళ్లనున్న బండి సంజయ్.. ఇవాళ ఉదయం 11 గంటలకు గన్నవరం నుంచి ఇంద్రకీలాద్రి చేరుకోనున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోనున్న బండి సంజయ్... ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని సమీక్షించనున్నారు.

ఇక ఇవాళ సాయంత్రం తిరిగి హైదరాబాద్ రానున్నారు బండి సంజయ్. ఇక ఇవాళ ఏపీ రాజకీయాలపై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేసే ఛాన్స్‌ ఉంది. ఇది ఇలా ఉండగా, అటు ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించనున్నారు. అంటే బండి సంజయ్‌, సీఎం జగన్‌ ఒకే రోజున విజయవాడకు వెళుతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌ (ఏపీ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం) 21 వ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మహా సభలలో పాల్గొననున్నారు సీఎం జగన్‌. ఇక ఇవాళ మధ్యాహ్నం 12.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్‌... ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మహా సభలలో పాల్గొననున్నారు.

Tags:
Next Story
Share it