CM Jagan : పవన్ కల్యాణ్​ కంటే బర్రెలక్క బెటర్

తెలంగాణ ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనూ ఆమె పేరు హాట్ టాపిక్‌గా మారింది.

CM Jagan : పవన్ కల్యాణ్​ కంటే బర్రెలక్క బెటర్
X

CM Jagan : తెలంగాణ ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనూ ఆమె పేరు హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క చాలా గొప్పదని సీఎం జగన్ విమర్శించారు. ప్రస్తుతం వైసీపీ నేతలు బర్రెలక్క పేరును ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పలాస బహిరంగ సభలో పవన్‌పై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తే కనీసం బర్రెలక్కకు పడిన ఓట్లు కూడా పడవన్నారు. చంద్రబాబు తన దత్తపుత్రుడిని పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు. ఆ దత్తపుత్రుడు తెలంగాణలో పోటీ చేస్తే ఏమైందో అందరికీ తెలిసిందే, తెలంగాణ ఎన్నికల సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు విని అందరూ ఆశ్చర్యపోయారు. పెద్దఎత్తున చర్చలు జరిపిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదన్నారు. పాదయాత్రలో ఉద్దాన ప్రాంత ప్రజల కష్టాలు చూశానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను తీసుకొచ్చామన్నారు. కిడ్నీ రోగులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యసేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. త్వరలో ప్రజలకు కిడ్నీ మార్పిడి విధానాన్ని అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చేసరికి ఎత్తులు, పొత్తులు, జిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారని, విశాఖను పరిపాలన రాజధానిని చేస్తామంటే అడ్డుపడుతున్నారని సీఎం జగన్ విమర్శలు చేశారు.Tags:
Next Story
Share it