Mangalagiri : జనసేన పార్టీ లో చేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు!

తెలుగు దేశం పార్టీ నుండి భీమవరం నియోజకవర్గం లో ఎన్నో ఏళ్ళ నుండి కొనసాగుతూ శాంత మూర్తి గా పేరు తెచ్చుకున్న పులపర్తి అంజిబాబు నేడు పవన్ కళ్యాణ్ సమక్షం లో జనసేన పార్టీ లోకి తన అనుచరులతో కలిసి చేరారు.

Mangalagiri : జనసేన పార్టీ లో చేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు!
X

న్యూస్ లైన్, మంగళగిరి : తెలుగు దేశం పార్టీ నుండి భీమవరం నియోజకవర్గం లో ఎన్నో ఏళ్ళ నుండి కొనసాగుతూ శాంత మూర్తి గా పేరు తెచ్చుకున్న పులపర్తి అంజిబాబు నేడు పవన్ కళ్యాణ్ సమక్షం లో జనసేన పార్టీ లోకి తన అనుచరులతో కలిసి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నాకు చివరి శ్వాస ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ జనసేన కోసమే పని చేస్తాను. నాకు నిన్ననే ఈరోజు జనసేన పార్టీ లో చేరాలని సమాచారం వచ్చింది. ఈ సమాచారం అందిన వెంటనే నా క్యాడర్ కి ఒకే ఒక్క ఫోన్ కాల్ చేశాను. ఈరోజు 300 కి పైగా కార్లు వేసుకొని వచ్చి నాకు మద్దత్తు తెలిపారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం అంటే. అందరూ భీమవరం నుండి నేను పోటీ చేస్తున్నాని అనుకున్నారేమో, నేను కాదు ఇక్కడి నుండి కళ్యాణ్ గారే పోటీ చేస్తారు' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Tags:
Next Story
Share it