BJP : ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు జాబితా విడుదల!

ఆంధ్ర ప్రదేశ్ మే 13 వ తారీఖున జరగబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

BJP : ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు జాబితా విడుదల!
X

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ మే 13 వ తారీఖున జరగబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ 144 స్థానాల్లో, జనసేన పార్టీ 21 స్థానాల్లో, బీజేపీ పార్టీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేసారు. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా, జనసేన రెండు స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తుంది. టీడీపీ జనసేన పార్టీలు ఇంకా 9 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చెయ్యాల్సి ఉండగా, బీజేపీ తాము పోటీ చెయ్యబోయే 6 ఎంపీ స్థానాలను కోద్ది రోజుల క్రితమే ప్రకటించగా,నేడు 10 ఎమ్మెల్యే స్థానాలను అధికారికంగా ప్రకటించారు.

ఒక్కసారి ఆ అభ్యర్థుల జాబితాని పరిశీలిస్తే ఎచ్చెర్ల నుండి ఈశ్వర రావు, విశాఖపట్నం నార్త్ నుండి విష్ణు కుమార్ రాజు, అరకు నుండి పంగి రాజారావు, అనపర్తి నుండి శివ కృష్ణం రాజు, కైకలూరు నుండి కామినేని శ్రీనివాస రావు, విజయవాడ వెస్ట్ నుండి సృజనా చౌదరి, బద్వేల్ నుండి బొజ్జ రోషన్న, జమ్మలమడుగు నుండి ఆదినారాయణ రెడ్డి, ఆదోని నుండి పార్థసారథి, ధర్మవరం నుండి సత్యకుమార్ పోటీ చెయ్యనున్నారు. ఈ లిస్ట్ లో విజయవాడ వెస్ట్ స్థానం జనసేన పార్టీ కి వస్తుందని అందరూ అనుకున్నారు. పోతిన మహేష్ జనసేన పార్టీ ని ఆ స్థానం లో ఎంతో వృద్ధి చేసారు. ఆయనకీ సీట్ దక్కకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:
Next Story
Share it