BJP: 8 ఎంపీ సీట్లను డిమాండ్ చేసిన బీజేపీ..చంద్రబాబు ఒప్పుకున్నట్టేనా?

ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం, జనసేన పార్టీలు బీజేపీ తో పొత్తు వ్యవహారం దాదాపుగా కొలిక్కి వచ్చేసింది. నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఢిల్లీ కి వెళ్లి అమిత్ షా ని కలిశారు.

BJP:  8 ఎంపీ సీట్లను డిమాండ్ చేసిన బీజేపీ..చంద్రబాబు ఒప్పుకున్నట్టేనా?
X

న్యూస్ లైన్, అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం, జనసేన పార్టీలు బీజేపీ తో పొత్తు వ్యవహారం దాదాపుగా కొలిక్కి వచ్చేసింది. నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఢిల్లీ కి వెళ్లి అమిత్ షా ని కలిశారు. వాళ్ళతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత పొత్తు ఫైనల్ అయ్యింది అనే విషయం మీడియా కి లీక్ అయ్యింది. అయితే పొత్తులో బీజేపీ పార్టీ 8 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలు కోరినట్టు తెలుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం 6 ఎంపీ లు, 4 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తామని చెప్పారట. మరి బీజేపీ కి అందుకు ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. కానీ టీడీపీ అనుకూల మీడియా మాత్రం పొత్తు ఖరారు అయ్యిందనే చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ నేటి సాయంత్రం లోపు వచ్చేస్తుంది అట. ఉమ్మడి ప్రెస్ మీట్ ద్వారా పవన్ కళ్యాణ్ , చంద్రబాబు ఈ విషయాన్నీ తెలియచేయనున్నారు.

Tags:
Next Story
Share it