Ap Elections : టీడీపీ - జనసేన కూటమిలోకి బీజేపీ..6 ఎంపీ సీట్లు డిమాండ్!

సంక్రాంతి లోపు బీజేపీ పార్టీ అధికారికంగా టీడీపీ - జనసేన కూటమితో కలుస్తుందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ నిన్న తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తెలిపాడు.

Ap Elections : టీడీపీ - జనసేన కూటమిలోకి బీజేపీ..6 ఎంపీ సీట్లు డిమాండ్!
X

Newsline ,Vijayawada : ఆంధ్ర ప్రదేశ్ లో సరిగ్గా మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో జగన్ ని ఎదురుకోవడానికి టీడీపీ - జనసేన పార్టీలు చేతులు కలిపిన సంగతి మన అందరికీ తెలిసిందే. మాతో పాటుగా బీజేపీ పార్టీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాం అంటూ పవన్ కళ్యాణ్ పదే పదే ప్రతీ సభలోను చెప్తూ ఉండేవాడు. మొత్తానికి బీజేపీ ని కూటమిలోకి లాగడం లో సక్సెస్ అయ్యాడు. సంక్రాంతి లోపు బీజేపీ పార్టీ అధికారికంగా టీడీపీ - జనసేన కూటమితో కలుస్తుందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ నిన్న తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తెలిపాడు. ఇప్పటికే కేంద్రం లో ఉన్న పెద్దలతో పవన్ కళ్యాణ్ మరియు నారా చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. రాబొయ్యే రోజుల్లో బీజేపీ పార్టీ కి ఎన్ని ఎంపీ స్థానాలు ఉంటే, మళ్ళీ అధికారం లోకి రావడానికి అంత సులభం అవుతుంది.

అందుకే టీడీపీ -జనసేన కూటమిని 6 ఎంపీ స్థానాలు డిమాండ్ చేస్తున్నారట. అంతే కాకుండా 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని, అసెంబ్లీ స్థానాల విషయం లో కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు కానీ, ఎంపీ స్థానాల విషయం లో అసలు తగ్గేదే లేదని, కచ్చితంగా ఆరు ఎంపీ స్థానాలు ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పారట. మరి టీడీపీ , జనసేన అందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి. బీజేపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఆంధ్ర ప్రజలు చాలా కోపం మీద ఉన్నారు. ఇలాంటి సమయం లో బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ - జనసేన కూటమి కి నెగటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:
Next Story
Share it