Tdpjanasena: టీడీపీ - జనసేన తో పొత్తు లేదని తేల్చేసిన బీజేపీ!

టీడీపీ జనసేన పార్టీలు బీజేపీ తో పొత్తు పెట్టుకునేందుకు ఎంతలా తహతహలాడుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. తెలుగు దేశం పార్టీ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణే బీజేపీ కోసం వెంపర్లాడుతున్నారు.

Tdpjanasena: టీడీపీ - జనసేన తో పొత్తు లేదని తేల్చేసిన బీజేపీ!
X

న్యూస్ లైన్, అమరావతి : టీడీపీ జనసేన పార్టీలు బీజేపీ తో పొత్తు పెట్టుకునేందుకు ఎంతలా తహతహలాడుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. తెలుగు దేశం పార్టీ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణే బీజేపీ కోసం వెంపర్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గౌరవప్రదంగా పవన్ కళ్యాణ్ కి 35 సీట్లు కేటాయిస్తే, బీజేపీ పొత్తులో ఉండాలని పెట్టుబడి, 11 స్థానాలను త్యాగం చేసారు పవన్ కళ్యాణ్. ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంతలా పరితపిస్తున్నారో అభిమానులకు సైతం అర్థం కావడం లేదు. అయితే ఇన్ని సీట్స్ త్యాగం చేసినప్పటికీ కూడా బీజేపీ పార్టీ టీడీపీ, జనసేన తో చేతులు కలపడానికి సుముఖత చూపడం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త.

ఢిల్లీ అధిష్టానం ఈమేరకు చివరి నిర్ణయం తీసుకుందని, రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చెయ్యాలని అనుకుంటున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. మార్చి 4 వ తేదీలోపు ఈ పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సీట్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయే రెండవ అభ్యర్థుల లిస్ట్ లో జనసేన 35 స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక విధంగా ఇది జనసేన పార్టీ క్యాడర్ కి శుభవార్త అనే చెప్పాలి.

Tags:
Next Story
Share it