Ap BJP : పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే పొత్తు..తేల్చి చెప్పేసిన బీజేపీ!

మేము పొత్తులోకి రావాలంటే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిని చెయ్యాలి అంటూ డిమాండ్ చేస్తున్న బీజేపీ.

Ap BJP : పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే పొత్తు..తేల్చి చెప్పేసిన బీజేపీ!
X

Newsline, Vijayawada : నిన్నటి నుండి సోషల్ మీడియా లో టీడీపీ మరియు జనసేన పొత్తులోకి బీజేపీ పార్టీ కూడా చేరనుంది, 2014 ఎన్నికలను మరోసారి రిపీట్ చెయ్యబోతున్నారు అని సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా త్వరలోనే బీజేపీ కూడా పొత్తులోకి రాబోతుంది, సంక్రాంతి లోపు ఈ విషయం పై పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వస్తే పొత్తులోకి వస్తే బీజేపీ వాళ్ళు డిమాండ్ చేసేవి ఇవే. కచ్చితంగా ఆరు నుండి 8 ఎంపీ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలి. ఈ షరతులు ఒప్పుకుంటేనే పొత్తుని అంగీకరిస్తాము అని కుండబద్దలు కొట్టినట్టు టీడీపీ అధిష్టానం కి చెప్పిందట. బీజేపీ డిమాండ్స్ కి చంద్రబాబు నాయుడు అసంతృప్తి గా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎంపీ స్థానాల విషయం లో ఒక మెట్టు దిగడానికి సిద్దమే కానీ, అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం కష్టం అని, జనసేన పార్టీ కి సీట్లు కేటాయింపు విషయం లోనే తర్జన భర్జన పడుతున్నామని, ఇలాంటి సమయం బీజేపీ కి అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం కష్టం అని తెలుస్తుంది. అంతే కాదు పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి అభ్యర్థి ప్రతిపాదన కూడా ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలతో చెప్పినట్టు తెలుస్తుంది. ఈమధ్యనే నారాలోకేష్ అలియాన్స్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఉంటాడు అని తేల్చి చెప్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతలోపే బీజేపీ ఈ ప్రతిపాదన పెట్టడం టీడీపీ కి పెద్ద షాక్ అనే చెప్పాలి.

Tags:
Next Story
Share it