Botsa Satyanarayana: త్వరలోనే మెగా డీఎస్సీ.. మంత్రి బొత్స కీలక ప్రకటన

ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను జరుగనున్నాయి.

Botsa Satyanarayana: త్వరలోనే మెగా డీఎస్సీ..  మంత్రి బొత్స కీలక ప్రకటన
X


న్యూస్ లైన్, Botsa Satyanarayana: ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను జరుగనున్నాయి. అందుకు ముందే డీఎస్సీ(DSC) పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ప్రకటించారు. ప్రస్తుతం డీఎస్సికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందన్నారు. డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామన్నారు. అలాగే యూనివర్సిటీ ఐఐటీలో ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అంశాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని మంత్రి బొత్స విమర్శించారు. మాట్లాడే అంశాలు ప్రజలకు ఎంత ఉపయోగమో బేరీజు వేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యత విద్యని స్పష్టం చేశారు.

బైజుస్ తో చేసుకున్న ఒప్పందం లో ఎక్కడా ఆర్థికపరమైన అంశాలు లేవన్నారు. బైజూస్(Byjus) సంస్థ ఉచితంగానే కంటెంట్ అందిస్తోందన్నారు. 5.18 లక్షల ట్యాబ్ లు 8 తరగతి విద్యార్దులకు ఇచ్చామన్నారు. ఈ ఏడాది మూడు సంవత్సరాలకు సంబధించిన కంటెంట్ ను ట్యాబ్(TAB) ల్లో పెట్టి ఇస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో గందరగోళం సృష్టించవద్దంటూ రాజకీయ పార్టీలను కోరారు. టోఫెల్ కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ప్రపంచ వ్యాప్తంగా తెలుసన్నారు. ఓ సెలబ్రిటీకి చెందిన రాజకీయ పార్టీ చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. ప్రైమరీ స్థాయిలో 6.30 లక్షల మందికి, జూనియర్ స్థాయిలో 14 లక్షల మందికి పరీక్షలు ఉంటాయని బొత్స వివరించారు. ప్రస్తుతం ఒక్కో పరీక్ష కు ఒక్కొక్కరికి 7 రూపాయల చొప్పున చెల్లించాలని ఒప్పందం కుదిరిందన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి(Creativity) పెంచాలని ప్రయత్నం చేస్తే అడ్డుపుల్ల వేస్తున్నారని ప్రత్యర్ధులపై విమర్శలు గుప్పించారు. విశాఖ తో పాటు కడప(kadapa)లోనూ సీఎం కు క్యాంప్ ఆఫీస్ ఉందని ఆయన గుర్తు చేశారు. ఉగాది కల్లా సెలబ్రిటీ పార్టీ, టీడీపీ ఉండవని బొత్స జోస్యం చెప్పారు.

Tags:
Next Story
Share it