Breaking: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు!

తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. నంద్యాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరిన చంద్రబాబు తరలింపు కాన్వాయ్ మొదలు కాగా.. సాయంత్రం 5 తర్వాత సీఐడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఆయనను ఇక్కడికి తరలించడానికి కాన్వాయ్ ప్రయాణం 9 గంటలకు పైగా సాగింది. 

Breaking: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు!
X

న్యూస్‌లైన్, డెస్క్: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. నంద్యాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరిన చంద్రబాబు తరలింపు కాన్వాయ్ మొదలు కాగా.. సాయంత్రం 5 తర్వాత సీఐడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఆయనను ఇక్కడికి తరలించడానికి కాన్వాయ్ ప్రయాణం 9 గంటలకు పైగా సాగింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో సీ‌ఐ‌డీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టే ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజయవాడ సివిల్‌ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో సివిల్‌ కోర్టు వద్ద భారీ భద్రత పోలీసులు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పోలీస్‌ సిబ్బందిని కోర్టు వద్ద మోహరించారు. ఇక, చంద్రబాబుని విజయవాడ కోర్టు 3వ అదనపు జిల్లా, ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి వద్ద హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ న్యాయమూర్తి ముందు చంద్రబాబు తరపున ఇప్పటికే ఆయన కేసులు చూస్తున్న న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తారని తెలుస్తోంది.

Tags:
Next Story
Share it