BRS MLA: ఏపీలో చంద్రబాబు ఓటమి ఖాయం.. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని గులాబీ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు

BRS MLA: ఏపీలో చంద్రబాబు ఓటమి ఖాయం.. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి
X

BRS MLA: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని గులాబీ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మే 13వ తేదీన ఏపీలో పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలని రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కంకణం కట్టుకున్నాయి.

కాంగ్రెస్, బిజెపి, జనసేన అలాగే తెలుగుదేశం పార్టీలు అన్ని కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే సింహం సింగిల్ గా వస్తుందన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పని అయిపోయిందని...బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆయన పెద్ద తప్పు చేశారని తెలిపారు. జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలేవి తర్వాత కాలంలో మనగాఢ సాధించిన దాఖలాలు లేవన్నారు. పొత్తు తర్వాత జత గూడిన పార్టీలను మింగేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

Tags:
Next Story
Share it