AP Budget 2024 : బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్..ఆ రెండు రంగాలకు పెద్ద పీట!

ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మరో మారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నందున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేడు అసెంబ్లీ లో ఇంటెర్మ్ బడ్జెట్ ని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టాడు.

AP Budget 2024 : బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్..ఆ రెండు రంగాలకు పెద్ద పీట!
X

న్యూస్ లైన్, అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మరో మారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నందున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేడు అసెంబ్లీ లో ఇంటెర్మ్ బడ్జెట్ ని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టాడు. ఈ బడ్జెట్ లో అధికంగా వ్యవసాయానికి పెద్ద పీట వేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఏ వర్గాన్ని విసమరించొద్దు అన్న సీఎం జగన్ చెప్పిన మాటని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ని తయారు చేసాము అంటూ బుగ్గన వ్యాఖ్యానించాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ' ఈ వార్షిక బడ్జెట్ 2,86,389 కోట్ల రూపాయిలు ఉంటుంది. ఆదాయ వ్యయం 2,30,110 కోట్లు ఉండగా, ద్రవ్య లోటు 55,817 కోట్లు , మూలధన వ్యయం 30,530 కోట్లు ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. 729 కోట్ల రూపాయలతో 17,239 పనులను పూర్తి చేశామని ప్రకటించాడు. అంతే సీఎం జగన్ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో ఉన్నతమైన పధకాలను ప్రవేశ పెట్టాడని, వెయ్యి స్కూల్స్ కి పైగా CBSE సిలబస్ ని ప్రవేశ పెట్టమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసాడు. ఇంకా అయన మాట్లాడుతూ ' జగనన్న విద్యా దీవెన కింద 11,901 కోట్ల ఖర్చు చేసాము. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 1,858 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి కోటీ 25 లక్షల రూపాయిల ఆర్ధిక సాయం అందించాం' అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అలాగే జగనన్న వసతి దీవెన పథకం కింద 4,276 కోట్ల రూపాయిలు ఖర్చు చేశామని, ప్రతీ జిల్లాలో దిశా పోలీస్ స్టేషన్స్ ని ఏర్పాటు చేశామని పేర్కొన్నాడు.

Tags:
Next Story
Share it