Godavari Districts : వెయ్యి కొట్టు..బండి పట్టు..ఆంధ్రలో జోరు మీదున్న కోడి పందాలు!

నారాయణపురం అనే ఊర్లో పందాలు జరుగుతున్న చోట వెయ్యి రూపాయిలు ఇచ్చి కూపం కొంటే, లాటరీలో రెండు బైకులు గెలుచుకునే అద్భుతమైన అవకాశం ని అందించారు. దీంతో పందాలు వెయ్యాలని అనుకునేవాళ్లు పెద్ద ఎత్తున కూపన్లు కొనుగోలు చెయ్యడానికి ఎగబడ్డారు.

Godavari Districts : వెయ్యి కొట్టు..బండి పట్టు..ఆంధ్రలో జోరు మీదున్న కోడి పందాలు!
X

న్యూస్ లైన్ డెస్క్ : సంక్రాంతి వైభోగం ఎలాంటిదో తెలియాలంటే ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లాల్సిందే. ముఖ్యంగా గోదావరి జిల్లాలకు వివిధ రాష్ట్రాల నుండి టూరిస్టులు వచ్చి కోళ్ల పందాలు వంటివి చూస్తుంటారు. గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు సంక్రాంతి సమయం లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటారు జనాలు. ఈ కోళ్ల పందాలకు సంబంధించిన ఏర్పాట్లు ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో చేసారు నిర్వాహకులు. వివిధ ప్రాంతాల నుండి భారీ స్థాయిలో జనాలు వచ్చి చూసే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కోళ్ల పందాలు చూసేలా ఏర్పాట్లు చేసారు. ఎల్ఈడీ స్క్రీన్లు , యాంకర్ల హడావడి, ఊరూరా లైటింగ్స్ తో ఉభయ గోదావరి జిల్లాలు కళకళలాడిపోయాయి. ఇక పందాలు చూసేందుకు వచ్చే జనాలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు నిర్వాహకులు.

నారాయణపురం అనే ఊర్లో పందాలు జరుగుతున్న చోట వెయ్యి రూపాయిలు ఇచ్చి కూపం కొంటే, లాటరీలో రెండు బైకులు గెలుచుకునే అద్భుతమైన అవకాశం ని అందించారు. దీంతో పందాలు వెయ్యాలని అనుకునేవాళ్లు పెద్ద ఎత్తున కూపన్లు కొనుగోలు చెయ్యడానికి ఎగబడ్డారు. ఇది ఇలా ఉండగా ఈ కోళ్ల పందాలు ఎక్కువగా భీమవరం , నర్సాపురం, పాలకొల్లు, రాజమండ్రి మరియు కోనసీమ ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఈ పందాలకు స్థానిక రాజకీయ నాయకుల మద్దతు కూడా ఉంది. సంవత్సరం మొత్తం బలమైన ఆహారం తో మేపబడిన కోళ్లను ఈ పందాలలో దింపబోతున్నారు. బాదం, పిస్తా, వివిధ మెడిసన్లతో పాటు వీటికి ప్రతీ రోజు ఆర్మీ ఈత కొట్టించడం, ఇతర శిక్షణ ఇచ్చి కోళ్లను బరిలో దింపుతున్నారు పందెంరాయుళ్లు.

Tags:
Next Story
Share it