AP: .8 తులాల గొలుసు కోసం వృధ్ధురాలిపై హత్యాయత్నం చేసిన కేబుల్ ఆపరేటర్.

అనకాపల్లి గవరపాలెం లో దారుణం జరిగింది. అనకాపల్లి జిల్లా గవరపాలెంలో ..పార్క్ సెంటర్ వద్ద ఓ ఇంట్లో ఆపరేటర్ ఓ మహిళ గొంతు నులిమి హత్యాయత్నంకు పాల్పడ్డాడు.

AP: .8 తులాల గొలుసు కోసం వృధ్ధురాలిపై హత్యాయత్నం చేసిన కేబుల్ ఆపరేటర్.
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అనకాపల్లి( anakapalli) గవరపాలెం లో దారుణం జరిగింది. అనకాపల్లి జిల్లా గవరపాలెంలో ..పార్క్ సెంటర్ వద్ద ఓ ఇంట్లో ఆపరేటర్ ఓ మహిళ గొంతు నులిమి హత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఆమె మెడలో ఉన్న ఎనిమిది తులాల గొలుసు ఎత్తుకెళ్లాడు. కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. పోలీసులు దర్యాప్తులో నిందితుడు కేబుల్ ఆపరేటర్ గా గుర్తించి, నిందితుడు కోసం గాలిస్తున్నారు.

కర్రీ లక్ష్మీనారాయణమ్మ( karri narayanaamma) ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. లక్ష్మీనారాయణమ్మను చూడడానికి వచ్చిన కూతురుకి ఆమె సోఫా లో పడి ఉండడం చూసి వెంటనే హాస్పటిల్ కు తరలించారు. ఆమె శరీరంపై గాయాలు చూసి అనుమానం కలిగిన కొడుకు..వెంటనే ఇంట్లో ఉన్న సీసీ కెమరా లో చెక్ చేయగా కేబుల్ ఆపరేటర్ గా తేలింది. తల్లి చేతికి బంగారు గాజులు ఉన్నాయి కానీ మెడలో గొలుసు లేదని గుర్తించిన కొడుకు పోలీసులకు పిర్యాధు చేశారు. కేసు నమోదు చేసి క్లూస్ టీం ద్వారా నిందితుడు కేబుల్ ఆపరేటర్ గా గుర్తించమన్న పోలీసులు నిందితుడు కోసం గలిస్తున్నాం అని తెలియజేశారు.

ఆడవారు ఎవ్వరు లేని టైంలో .తెలియని మనుషుల్ని లోపలకు రానివ్వకూడదని అన్నారు పోలీసులు. తెలిసిన వ్యక్తులే అయినా...టైం కాని టైంలో వస్తే నిర్మొహమాటంగా చెప్పడని తెలిపారు.

Tags:
Next Story
Share it