CID investigation: నేడు రెండో రోజు సీఐడీ కస్టడీలో చంద్రబాబు

రాజమండ్రి సెంట్రల్ జైలులో నేడు రెండో రోజు చంద్రబాబు నాయుడు ని విచారణ చేయనున్నారు సిఐడి అధికారులు. ఇవాళ ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చంద్రబాబు నాయున్ని విచారణ చేయనున్నారు సీఐడీ అధికారులు. ఇక అటు నేటితో చంద్రబాడు సిఐడీ రెండు రోజుల కస్టడీ ముగియనుంది. చంద్రబాబు నాయుడుకి వైద్య పరీక్షలు చేసిన అన

CID investigation: నేడు రెండో రోజు సీఐడీ కస్టడీలో చంద్రబాబు
X

CID investigation : రాజమండ్రి సెంట్రల్ జైలులో నేడు రెండో రోజు చంద్రబాబు నాయుడు ని విచారణ చేయనున్నారు సిఐడి అధికారులు. ఇవాళ ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చంద్రబాబు నాయున్ని విచారణ చేయనున్నారు సీఐడీ అధికారులు. ఇక అటు నేటితో చంద్రబాడు సిఐడీ రెండు రోజుల కస్టడీ ముగియనుంది. చంద్రబాబు నాయుడుకి వైద్య పరీక్షలు చేసిన అనంతరం విచారణ చేయనున్నారు సిఐడి అధికారులు.

సి.ఐ.డి.కి చెందిన ముగ్గురు డిఏస్పీ స్థాయి అధికారులు, 4 సి.ఐ.లు, ఏఎస్.ఐ , కానిస్టేబుల్, వీడియోగ్రఫర్, ఇద్దరు ఆఫీషియల్ మధ్యవర్తుల సమక్షంలో చంద్రబాబు నాయుడు విచారణ జరుగుతుంది. ధనుంజయుడు నేతృత్వంలో రెండు బృందాలుగా మారి విచారణ చేస్తున్నారు సిఐడి అధికారులు. ఇవాళ సాయంత్రంతో చంద్రబాబు రిమాండ్ గడువు పూర్తి కానుంది. సిఐడీ విచారణ అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ముందు వర్చువల్ గా చంద్రబాబును హాజరపర్చనున్నారు సీఐడీ అధికారులు.

Tags:
Next Story
Share it