Vijayawada : 200,500 రూపాయిల నోట్లను రద్దు చెయ్యాలి - చంద్రబాబు

పెద్ద నోట్లను రద్దు చెయ్యాలనే ఆలోచన నా నుండే పుట్టింది అంటూ చంద్రబాబు నాయుడు మరోసారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

Vijayawada : 200,500 రూపాయిల నోట్లను రద్దు చెయ్యాలి - చంద్రబాబు
X

న్యూస్ లైన్,విజయవాడ : పెద్ద నోట్లను రద్దు చెయ్యాలనే ఆలోచన నా నుండే పుట్టింది అంటూ చంద్రబాబు నాయుడు మరోసారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. అంతే కాదు 200 , 500 రూపాయిల నోట్లను కూడా రద్దు చెయ్యాలని, వైసీపీ లాంటి పార్టీ అరాచకాలను కట్టివేయడానికి డిజిటల్ కరెన్సీ అవసరమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సంపాదన మొత్తం హవాలా రూపం లో విదేశాలకు తరలిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రం,దేశం శ్రేయస్సు కోసమే జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని, ఎన్నికలలో ఎట్టి పరిస్థితిలోనైనా గెలిచి తీరుతామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే నేడు ఆయన ఎన్నికలలో పోటీ చెయ్యబోతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో వర్క్ షాప్ ని నిర్వహించి, ఎన్నికలలో ఎలా ముందుకు పోవాలి అనే దానిపై దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

Tags:
Next Story
Share it