Road Accident: అల్లూరి జిల్లాలో సిమెంట్ లారీ బోల్తా..ఐదుగురు మృతి

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh)లో దారుణం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా (Alluri District)లో ఘోరమైన రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.

Road Accident: అల్లూరి జిల్లాలో సిమెంట్ లారీ బోల్తా..ఐదుగురు మృతి
X

Road Accident: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh)లో దారుణం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా (Alluri District)లో ఘోరమైన రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఏవోబీ కటాఫ్ ఏరియా(AOB Area)లో జరిగిన ఈ విషాద ఘటనలో ఐదుగురు దుర్మరణం (5 died) చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రగాయాల పాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అల్లూరి జిల్లా ఏవోబీ కటాఫ్ ఏరియాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

హంతల్‌గూడ ఘాట్ రోడ్డుపై సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ (cement Load Lorry) అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ లారీ చిత్రకొండ నుంచి జడంబోకు సిమెంట్ లోడ్‌తో వెళ్తోంది. ఆ సమయంలో లారీ బోల్తా పడటంతో ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయాలపాలైన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it