Chandrababu : నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్

నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు

Chandrababu : నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్
X

Chandrababu : నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో A1గా ఉన్నారంటూ అర్ధరాత్రి నుంచి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా టిడిపి నేతలు అడ్డుకున్నారు. టిడిపి నేతలను అరెస్టు చేసిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ కు సంబంధించిన పేపర్లను చంద్రబాబుకు, ఆయన లాయర్లకు ఇచ్చారు.

అయితే.. స్కిల్ కేసులో తన పేరు ఎక్కడ ఉందో చెప్పాలని టిడిపి అధినేత చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. 'నన్ను మీరు చుట్టుముట్టి బెదిరించడం సరికాదు. ఏం జరిగిందని కేసు పెడుతున్నారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు. ఆధారాలు ఉంటే ఉరి తీయండి. ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు... నోటీసులు ఇవ్వకుండా ఎలా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాకుండా సూపర్వైజర్ ఆఫీసర్ ఎలా వస్తారు? నేనేమైనా టెర్రరిస్టునా?' అని నిలదీశారు.

Tags:
Next Story
Share it