Chandrababu : చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691 కేటాయింపు

టిడిపి అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ తరుణంలోనే రాజమండ్రి జైలులో చంద్రబాబుకు స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గదిని కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్నేహ బ్లాక్ చుట్టూ జైలు సిబ్బందితో భద్రత కల్పించారు. డ

Chandrababu : చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691 కేటాయింపు
X

Chandrababu : టిడిపి అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ తరుణంలోనే రాజమండ్రి జైలులో చంద్రబాబుకు స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గదిని కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్నేహ బ్లాక్ చుట్టూ జైలు సిబ్బందితో భద్రత కల్పించారు. డ్యూటీ సిబ్బంది మినహ ఎవరిని అటువైపు వెళ్ళనీయడం లేదు. చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు.

జైలు గేటు దగ్గర నుంచి కమాండోలు వెనక్కి వెళ్లిపోయారు. లోకేష్, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు జవహర్ తదితర నాయకులు కొంతసేపు బయటే నిరీక్షించారు. లోకేష్ లోపలికి వెళ్లి చంద్రబాబుకు ఇవ్వాల్సిన ఆహారం మందుల గురించి అధికారులతో మాట్లాడి వచ్చారు. అలాగే కుటుంబ సభ్యులు ఆయనను ఎప్పుడు కలవచ్చో కూడా తెలుసుకున్నారు. ఇక అటు రాజమహేంద్రవరం జైలు వద్ద సుమారు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:
Next Story
Share it