delhi : చంద్రబాబుకు సుప్రీం కోర్టులో షాక్..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు(chandrababu) సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.

delhi : చంద్రబాబుకు సుప్రీం కోర్టులో షాక్..
X

న్యూస్ లైన్, ఢిల్లీ : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు(chandrababu) సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. డిసెంబర్ 8వ తేదీ వరకు కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. విచారణ అనంతరం కేసును వాయిదా వేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 11కి వాయిదా వేసింది.

కేసు విషయాలను బయట పెట్టొద్దు అంటూ చంద్రబాబుకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఆదేశాల వరకు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలిపింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చేవరకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ పెట్టింది. కాగా, చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజులు సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Tags:
Next Story
Share it