Ap Politics: తెలుగు దేశం పార్టీ క్యాడర్ చెవిలో కమలం పువ్వు!

ఎన్నడూ లేని విధంగా తెలుగు దేశం పార్టీ అత్యంత దయనీయమైన పరిస్థితిలోకి దిగజారిపోయింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతీ ఎన్నికలలో చంద్రబాబు కి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉండదు.

Ap Politics: తెలుగు దేశం పార్టీ క్యాడర్ చెవిలో కమలం పువ్వు!
X

న్యూస్ లైన్ డెస్క్: ఎన్నడూ లేని విధంగా తెలుగు దేశం పార్టీ అత్యంత దయనీయమైన పరిస్థితిలోకి దిగజారిపోయింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతీ ఎన్నికలలో చంద్రబాబు కి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉండదు. పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో 2019 ఎన్నికలు ఒక ఉదాహరణ. అందుకే ఈసారి ఏకంగా రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి రాబోతుంది తెలుగు దేశం పార్టీ. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ లో కనీసం ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీ కి తెలుగు దేశం ఎందుకు అంతలా తల వంచి ఆరు ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది అని. 2019 ఎన్నికలతో పోలిస్తే గణనీయమైన ఓటు బ్యాంక్ ఉన్న జనసేన పార్టీ కి కేవలం 21 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు ఇవ్వడం చివరికి తెలుగు దేశం పార్టీ క్యాడర్ కి కూడా న్యాయం అనిపించలేదు. తమ అధినేత చంద్రబాబు బీజేపీ కి అంతలా వంగి సలాం కొట్టడాలు తెలుగు దేశం పార్టీ క్యాడర్ కి ఏమాత్రం నచ్చడం లేదు.

ఇక రీసెంట్ గానే బీజేపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చెయ్యబోయే పది ఎమ్మెల్యే స్థానాలను ప్రకటించింది. ఈ పది స్థానాల్లో అనపర్తి నియోజకవర్గం కూడా ఉంది. ఇది తెలుగు దేశం పార్టీ కి కంచుకోట లాంటి నియోజకవర్గం. అలాంటి స్థానం ని పొత్తులో భాగంగా బీజేపీ కి కేటాయించింది టీడీపీ. ఈ స్థానం నుండి శివ కృష్ణంరాజు బీజేపీ తరుపున పోటీ చెయ్యనున్నారు. ఇతను గతం లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వార్డ్ మెంబెర్ గా పోటీ చేస్తే కేవలం ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాంటి అభ్యర్థికి సీటు కేటాయించడం ఏమిటని తెలుగు దేశం పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున రచ్చ చేసింది. అసలు ఏ ప్రాతిపదికన బీజేపీ కి పది స్థానాలు ఇచ్చారు? అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇదంతా కేవలం చంద్రబాబు తాను అరెస్ట్ కాకుండా ఉండేందుకే బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారని, దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న అరెస్టులు అందుకు ఉదాహరణ అని, అందుకే కోరినన్ని ఎంపీ సీట్లు అడిగిన వెంటనే టీడీపీ ఇచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.

Tags:
Next Story
Share it