New Delhi: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు..బీజేపీ తో పొత్తుపై చర్చ!

ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 60 రోజుల సమయం మాత్రమే ఉంది. ఒక పక్క అధికార పార్టీ వైసీపీ చాలా కూల్ గా అభ్యర్థుల జాబితాలను ప్రకటించుకుంటూ, 'సిద్ధం' సభలతో ముందుకు దూసుకుపోతున్నారు. కానీ ఇటు పక్క పొత్తు అంటూ నానా హుంగామ చేసిన టీడీపీ - జనసేన పార్టీలు ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు.

New Delhi: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు..బీజేపీ తో పొత్తుపై చర్చ!
X

న్యూస్ లైన్, న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 60 రోజుల సమయం మాత్రమే ఉంది. ఒక పక్క అధికార పార్టీ వైసీపీ చాలా కూల్ గా అభ్యర్థుల జాబితాలను ప్రకటించుకుంటూ, 'సిద్ధం' సభలతో ముందుకు దూసుకుపోతున్నారు. కానీ ఇటు పక్క పొత్తు అంటూ నానా హుంగామ చేసిన టీడీపీ - జనసేన పార్టీలు ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. పేరుకి కలిసి వెళ్తున్నారు అనే మాట తప్ప, ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకోవడం కోసం అసలు సిద్దపడట్లేదు. వీళ్లిద్దరి మధ్యనే పొత్తు కుదరడం లేదు అంటుంటే, ఆంధ్ర ప్రదేశ్ లో అసలు ఓటు షేర్ లేని బీజేపీ పార్టీ తో కూడా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం అయ్యాడు చంద్రబాబు. నేడు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపడానికి ఆయన ఢిల్లీ కి వెళ్ళాడు.

బీజేపీ పార్టీ పవర్ షేరింగ్ ఉంటేనే పొట్టులోకి అడుగుపెడుతాం అని అంటున్నారు. 8 ఎమ్మెల్యే టిక్కెట్లు, 4 ఎంపీ టిక్కెట్లు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు అడిగినన్ని ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అలాగే పవర్ షేరింగ్ క్రింద పవన్ కళ్యాణ్ ని రెండేళ్లు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి అనే షరతు కూడా ఒకటి ఉందట. ఇప్పటికే జనసేన పార్టీ 38 స్థానాలకు పైగా పోటీ చేయబోతున్నట్టు సోషల్ మీడియా లో చెప్పుకొస్తుంది. బీజేపీ కూడా జతకలిస్తే మరో 8 స్థానాలు పోతాయి. అంటే మొత్తం మీద తెలుగు దేశం పార్టీ కేవలం 120 స్థానాల్లో మాత్రమే పోటీ చేయబోతుంది అట. మరి ఈ పొట్టులోకి బీజేపీ కలవడం వల్ల లాభం కలుగుతుందా, లేదా 2009 ఫలితం రిపీట్ అవ్వబోతుందా అనేది చూడాలి.

Tags:
Next Story
Share it