Chandrababu: బయటికి వచ్చిన 28 పేజీల చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్

నిన్న చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ అధికారులు.. తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరు పరిచారు. ఈ తరుణంలోనే చంద్రబాబుకు కేసుకు సంబంధించి 28 పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పించారు సీఐడీ అధికారులు. ఈ రిమాండ్ రిపోర్టులో సీఐడీ చీఫ్ నిన్న చెప్పిన అంశాలనే ప్రధానంగా పేర్కొన్నారు దర్యాప్తు అధికారి.

Chandrababu: బయటికి వచ్చిన 28 పేజీల చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్
X

Chandrababu:నిన్న చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ అధికారులు.. తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరు పరిచారు. ఈ తరుణంలోనే చంద్రబాబు కేసుకు సంబంధించి 28 పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పించారు సీఐడీ అధికారులు. ఈ రిమాండ్ రిపోర్టులో... సీఐడీ చీఫ్ నిన్న చెప్పిన అంశాలనే ప్రధానంగా పేర్కొన్నారు.

కోర్టుకు రిమాండ్ రిపోర్టును అందించిన సీఐడీ... నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకోవడం అనే అంశాలను పొందుపరిచి.. బాబుపై నేరాభియోగం మోపింది. ఉద్దేశవూర్వకంగా మోసం చేయడం, ఫోర్జరీ చేసి మోసం చేయడం, డాక్యుమెంట్లను కూడా ఫోర్జరీ చేయడం, సాక్ష్యాధారాలను మాయం చేయడం, వంటి అభియోగాలు ఈ రిపోర్టులో పొందుపరిచింది సీఐడీ.

ప్రజా సేవకుడిగా తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని నివేదిక అందించింది. రిమాండ్ రిపోర్ట్‌లో నారా లోకేష్ పేరు కూడా చేర్చింది. డిజైన్ టెక్, సీమన్స్ ఎండీలతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని చంద్రబాబు పై అభియోగాలు మోపీంది సీఐడీ. 279 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సీఐడీ అధికారులు...డిజైన్ టెక్ సంస్థ... కొన్ని సంస్థలకు నిధులు బదిలీ చేసిన సమయంలో జీఎస్టీ ఎగవేసిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీని ఆధారంగా దర్యాప్తు చేస్తే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్న సీఐడీ అధికారులు.. టెక్నాలజీ పార్టనర్లుగా నామినేషన్ పద్దతిలో ఈ సంస్థలను నియమించారని, వారికి 371కోట్ల రూపాయలు ప్రభుత్వ వాటా కింద చంద్రబాబు ఆదేశాల మీద చెల్లించారని పేర్కొన్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని, తమ స్వార్ధం కోసం ఈ విధంగా చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సీఐడీ.

Tags:
Next Story
Share it