Chandrababu Naidu: కాసేపట్లో విజయవాడ సీబీఐ కోర్టుకు చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. నంద్యాల పర్యటనలో ఉన్న ఆయన్ని.. తెల్లవారుజామున స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో సీ‌ఐ‌డీ పోలీసులు బాబుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన కాసేపట్లో ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతల ప

Chandrababu Naidu: కాసేపట్లో విజయవాడ సీబీఐ కోర్టుకు చంద్రబాబు
X

న్యూస్‌లైన్, డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. నంద్యాల పర్యటనలో ఉన్న ఆయన్ని.. తెల్లవారుజామున స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో సీ‌ఐ‌డీ పోలీసులు బాబుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన కాసేపట్లో ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజయవాడ సివిల్‌ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఏసీబీ కోర్టు ఇంచార్జీ జడ్జి హిమబిందు ఎదుట చంద్రబాబును హాజరుపరచనున్నారు.

దీంతో కోర్టు వద్ద ఈ మార్గంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 200 మంది పోలీసులను కోర్టు ప్రాంగణంలో మోహరించారు. కోర్టు వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఆయన అరెస్టుతో చిలకలూరిపేటలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించారు.

Tags:
Next Story
Share it