Chandrababu : చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ఏసిబి కోర్టులో ముగిసాయి. తీర్పును జడ్జి సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో గత మూడు రోజులుగా ఇరుపక్షాల న్యాయవాదులు హోరాహోరీ వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరుపు లాయర్ దుబే కోరారు. బెయిల్ ఇవ్వద్దని, సిఐడి కస్టడ

Chandrababu : చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా
X

Chandrababu : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. గత 25 రోజులుగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులోనే ఉంటున్నారు. అయితే.. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ఏసిబి కోర్టులో ముగిసాయి. తీర్పును జడ్జి సోమవారానికి వాయిదా వేశారు.

ఈ కేసులో గత మూడు రోజులుగా ఇరుపక్షాల న్యాయవాదులు హోరాహోరీ వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరుపు లాయర్ దుబే కోరారు. బెయిల్ ఇవ్వద్దని, సిఐడి కస్టడీకి ఇవ్వాలని ఏఏజీ సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ఇది ఇలా ఉండగా.. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఇరుక్కోగా.. చంద్రబాబు కొడుకు నారా లోకేష్‌ అమరావతి రింగు రోడ్డు కేసులో ఇరుక్కున్నారు.

Tags:
Next Story
Share it