Chandrababu: నేటితో ముగియనున్న బాబు రిమాండ్..కొనసాగుతున్న వాదనలు !

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసిబి కోర్టు విధించిన రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో రిమాండ్ పొడిగింపు కోసం సిఐడి అధికారులు మరోసారి మెమో దాఖలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆయనను కస్టడీకి ఇవ్వాలన్న పిటీషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. దీంతో కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందోనని రాజకీయ వర్

Chandrababu: నేటితో ముగియనున్న బాబు రిమాండ్..కొనసాగుతున్న వాదనలు !
X

Chandrababu : స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసిబి కోర్టు విధించిన రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో రిమాండ్ పొడిగింపు కోసం సిఐడి అధికారులు మరోసారి మెమో దాఖలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆయనను కస్టడీకి ఇవ్వాలన్న పిటీషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. దీంతో కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, చంద్రబాబు రిమాండ్ ను కోర్టు ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బేయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ ఉదయం 11 గంటలకు విజయవాడ ఏసిబి కోర్టు విచారణ ప్రారంభం అయింది. ఈ కేసులో చంద్రబాబు వైపు తప్పిదాలు లేవని ఆయన తరపు లాయరు లాయర్ దూబే వాదనలు వినిపించారు. ఈ స్కాం వెనుక చంద్రబాబు ఉన్నారని, 13 సంతకాలు సహా అన్ని ఆధారాలు ఉన్నాయని ఏఏజీ పోన్నవోలు వాదించారు. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

Tags:
Next Story
Share it