Chintalapudi :కాంగ్రెస్ పార్టీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే!

ఎన్నికల సమయం లో ఒక పార్టీ నుండి మరో పార్టీ కి మారడం సహజం. టికెట్ ఆశించిన ఆశావహులు, టికెట్ దొరకనప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా టికెట్స్ దొరకకపోవడం అలా వేరే పార్టీలకు వెళ్లిపోతున్నారు.

Chintalapudi :కాంగ్రెస్ పార్టీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే!
X

న్యూస్ లైన్, చింతలపూడి: ఎన్నికల సమయం లో ఒక పార్టీ నుండి మరో పార్టీ కి మారడం సహజం. టికెట్ ఆశించిన ఆశావహులు, టికెట్ దొరకనప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా టికెట్స్ దొరకకపోవడం అలా వేరే పార్టీలకు వెళ్లిపోతున్నారు. జగన్ తన పార్టీ పోటీ చెయ్యబోయే 175 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేసారు. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ దొరకకపోవడం ఇటీవలే టీడీపీ, జనసేన లో చేరడం మనం చూసాము. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కూడా దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు. రీసెంట్ గానే చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల సమక్షం లో పార్టీ లో చేరారు. చింతలపూడి టికెట్ తనకి కాకుండా విజయ్ రాజు కి ఇవ్వడం పై అసంతృప్తి చెందిన ఎలిజా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే నందికొట్కూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డర్ కూడా షర్మిల సమక్షం లో కాంగ్రెస్ లో చేరారు.

Tags:
Next Story
Share it