CI Swarnalatha: సీఐ స్వర్ణలత రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు

CI Swarnalatha: నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్సిఐ స్వర్ణలత అరెస్టు కావడం సంచలనం రేపింది.

CI Swarnalatha: సీఐ స్వర్ణలత రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు
X

CI Swarnalatha: నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్సిఐ స్వర్ణలత అరెస్టు కావడం సంచలనం రేపింది. ఆమె మీద పలు ఐపీఎస్ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు అయ్యాయి. సిఐ స్వర్ణలత రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. నేవీ అధికారులు తెచ్చింది 90 లక్షలు కాదు.. రూ.12 లక్షలేనంటు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. నోట్ల మార్పిడి పేరుతో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించింది రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ బి.స్వర్ణలత గ్యాంగ్‌. దోపిడికీ పాల్పడిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్‌ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.

ఆ 12 లక్షల్లో ఆర్‌ఐ స్వర్ణలత, సూరిబాబులకు రూ. ఐదేసి లక్షలు, హోంగార్డు శ్రీనివాసరావుకు రూ. రెండు లక్షలు గా తీసుకున్నట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. దీంతో కేసు తీవ్రతను తగ్గించి ఇన్‌స్పెక్టర్‌ను బయటపడేసేందుకేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు 90 లక్షలు ఎవరివి..? ఎక్కడవి..? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో సైతం 90 లక్షల గురించి ప్రస్తావన రాలేదు. రూ..12 లక్షలతో కేసు ముగించేందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి.

Tags:
Next Story
Share it