Nara Lokesh: నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు.. 4వ తేదీన హాజరుకావాలి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కష్టాలు తప్పడం లేదు

Nara Lokesh: నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు.. 4వ తేదీన హాజరుకావాలి
X


న్యూస్ లైన్,Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కష్టాలు తప్పడం లేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ సీఐడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ ద్వారా లోకేశ్‌కు సీఐడీ 41ఏ నోటీసులు పంపింది. వచ్చే నెల 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో సూచించారు. తనకు నోటీసులు అందాయని లోకేష్ సీఐడీకి వాట్సాప్‌లో సమాధానం ఇచ్చినట్లు సమాచారం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అనంతరం లాయర్లతో నిరంతరం చర్చలు జరిపేందుకు వీలుగా నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలోని 50 అశోకా రోడ్‌లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉన్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ను ఏ14గా చేర్చారు. అయితే తర్వాత ఎఫ్‌ఐఆర్‌ మార్చారు.. ఎలా మార్చారు.. సాక్షిగా మార్చారా.. నిందితుడిగా ఉంచారా అనే విషయంపై క్లారిటీ లేదని హైకోర్టుకు తెలిపారు. దర్యాప్తు అధికారి నారా లోకేష్‌పై ఎఫ్‌ఐఆర్‌ను మార్చారని, ఆ కేసులో ఆయనను అరెస్టు చేయబోమని ఏజీ హైకోర్టుకు తెలిపారు. అరెస్ట్ చేసే ప్రసక్తే లేదంటూ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. స్కిల్‌, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో నారా లోకేష్‌ను కూడా నిందితుడిగా చేర్చారు. దీంతో ఆ కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబరు 4 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.కానీ నారా లోకేష్‌కి నోటీసులు అందించేందుకు సీఐడీ అధికారులు నేరుగా ఢిల్లీకి వచ్చారు. శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. కానీ నారా లోకేష్ కు నోటీసు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మరోవైపు నారా లోకేష్ ఎక్కడున్నారో సీఐడీ అధికారులకు తెలియడం లేదని వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. అయితే ఢిల్లీ వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన కార్యాలయంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ అక్కడే ఉన్నారు.

ఈ విషయాన్ని నారా లోకేష్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్ బస చేసిన హోటల్ నుంచి సీఐడీ అధికారులు నేరుగా ఆయన నివాసానికి వచ్చారు. ముగ్గురు అధికారులు గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లి లోకేష్‌కు నోటీసులు అందించారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో నారా లోకేష్ కు కూడా వాట్సాప్ లో నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. తనకు నోటీసులు అందాయని వాట్సాప్‌లో నారాలోకేష్ సమాధానమిచ్చారు. ఇక వాట్సాప్ లో నోటీసులు ఇచ్చే సదుపాయం ఉంటే... ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లి నేరుగా నోటీసులు ఇచ్చి హడావుడి చేయాల్సిన అవసరం ఏర్పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Tags:
Next Story
Share it