TDP -Janasena: జనసేన, టీడీపీ ఆత్మీయ సభలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

అనకాపల్లిలో జనసేన(janasena)-టీడీపీ ఆత్మీయ సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో పర్చూరి భాస్కరరావు వర్గంతో దూలం గోపి వర్గం ఘర్షణకు దిగింది.

TDP -Janasena: జనసేన, టీడీపీ ఆత్మీయ సభలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
X

TDP -Janasena: జనసేన, టీడీపీ ఆత్మీయ సభలో రెండు వర్గాల మధ్య ఘర్షణఅనకాపల్లిలో జనసేన(janasena)-టీడీపీ ఆత్మీయ సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో పర్చూరి భాస్కరరావు వర్గంతో దూలం గోపి వర్గం ఘర్షణకు దిగింది. తూర్పుగోదావరి(east godavari) జిల్లా పిఠాపురం నియోజకవర్గ సమన్వయ సమావేశంలో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం వాదోపవాదనలు చేసకున్నారు. దీంతో చిన్నపాటి గొడవ.. కాస్త కుర్చీలతో కొట్టుకునే దాకా వెళ్లింది. రెండు పార్టీల మధ్య ఇలాంటి గొడవలు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయని మొదటి నుంచి అందరూ అనుకుంటూనే ఉన్నారు. చంద్రబాబు(chandrababu), పవన్ మధ్య సమన్వయం కుదిరితే సరిపోదని, కిందిస్థాయి కార్యకర్తల మధ్య అలాంటి సమన్వయం ఉంటేనే వైసీపీకి గట్టి పోటీని ఇవ్వగలవని కొందరు చర్చించుకుంటున్నారు. జనసేన, టీడీపీ(tdp) పార్టీలు పోటీకి దిగుతున్న నియోజకవర్గాలు 40 వరకూ ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.

రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ వేడి రాజుకుంది. పిఠాపురంలో ఇరువర్గాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కుర్చీలతో కొట్టుకున్నారు. ఆత్మీయ సభలో టీడీపీ ఇంచార్జి వర్మ మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని రూ.2800 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఆ సమయంలో జనసేన ఇంచార్జి ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఎందుకు ఓడిపోయామని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని టీడీపీని ఉదయ్ శ్రీనివాస్ కోరారు. దాంతో వర్మకు కోపం వచ్చింది. మహామహులే ఎన్నికల్లో ఓడిపోయారని, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఆగ్రహించిన జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నేతల మధ్య మాటామాటా పెరిగింది. ప్రస్తుతం జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:
Next Story
Share it