Pawan Kalyan: సీఎం ఒక రౌడీ పిల్లవాడు.. జగన్‌పై పవన్ సంచలన వ్యాఖ్యలు! 

ఏపీ సీఎం జగన్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం జగన్ ఒక రౌడీ పల్లవాడని అన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఇవాళ తణుకులో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..

Pawan Kalyan: సీఎం ఒక రౌడీ పిల్లవాడు.. జగన్‌పై పవన్ సంచలన వ్యాఖ్యలు! 
X

న్యూస్‌లైన్, డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం జగన్ ఒక రౌడీ పల్లవాడని అన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఇవాళ తణుకులో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ జగ్గుబాయ్ అంటారని ఎద్దేవా చేశారు. ఒక జగ్గు బాయ్ రాష్ట్రాన్ని నడుపుతున్నాడని, ఆ జగ్గుబాయ్ గ్యాంగును ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసని ఘాటుగా స్పందించారు. జగన్ గిల్లడని ప్రధాని మోడీకి కంప్లైంట్ ఇస్తే బాగుండది కదా.. అందుకే ఏదైనా తాము చూసుకుంటామని చెప్పారు.

రాష్ట్రానికి జగన్ అనే జలగ బాగా ఇబ్బంది పెడుతుంది విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని అవినీతిని, అరాచకాన్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లిన ఘనత జగన్‌కు దక్కుతుందని కామెంట్లు చేశారు. మీరందరూ అనుకుంటున్నట్లు జగన్ తమకేమి శత్రువు కాదని, తనకు శత్రువుగా మారే అంత సీన్ లేదని వ్యాఖ్యానించారు. తన పోరాటం సీఎం జగన్‌ మీద కాదని.. సమస్యల మీదని స్పష్టం పవన్ కళ్యాణ్ చేశారు.

Tags:
Next Story
Share it