Cm Jagan : కడప జిల్లాలో 3 రోజుల పాటు సీఎం జగన్ పర్యటన!

నేటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న జగన్.

Cm Jagan : కడప జిల్లాలో 3 రోజుల పాటు సీఎం జగన్ పర్యటన!
X

Newsline , Kadapa : మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతిపక్షాలు ఎలా ఎన్నికల్లో వెళ్ళాలి అనే దానిపై వ్యూహాలు రచిస్తుంటే, మరోపక్క సీఎం జగన్ మాత్రం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు. అందులో భాగంగా నేడు ఆయన కడప జిల్లాకు విచ్చేయనున్నాడు. అక్కడ మూడు రోజుల పాటు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చెయ్యబోతున్నాడు సీఎం జగన్. ముందుగా గోపవరం లో సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్‌ ప్లాంట్‌లను ప్రారంభోత్సవం చెయ్యబోతున్నాడు. ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్యెల్యే లు మరియు పలువురు ముఖ్య నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద డాక్టర్‌ వైఎస్సార్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఇన్సిట్యూట్ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌, డాక్టర్‌ వైఎస్సార్‌ క్యాన్సర్‌ కేర్‌ బ్లాక్‌ లను ప్రారంభించబోతున్నాడు.

వీటితో పాటుగా ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం అలాగే వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో ఫ్లడ్‌ లైట్లను కూడా ప్రారంభించబోతున్నాడు సీఎం జగన్. చాలా కాలం తర్వాత జగన్ కడప జిల్లాకు విచేయబోతుండడం తో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు సీఎం జగన్ కి పెద్ద ఎత్తున స్వగతం పలుకబోతున్నారు. అంతే కాకుండా సీఎం జగన్ కడప జిల్లా ఎమ్యెల్యే లు మరియు కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు కూడా నిర్వహించనున్నాడు. ఈ సమావేశాల్లో సీఎం జగన్ రాబొయ్యే ఎన్నికలలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలి అనే దానిపై చర్చలు జరపబోతున్నారు.

Tags:
Next Story
Share it