cm jagan : జూన్ 4న నేను చెయ్యబోయే మొదటి సంతకం దానిపైనే - సీఎం జగన్

రాష్ట్రంలో అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు ఈ నెల పెన్షన్ తీసుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతీ నెల 1 వ తేదీ రాగానే వాలంటీర్లు ఇంటికి వచ్చి మరీ ఇచ్చే పెన్షన్స్, ఇప్పుడు క్యూ లైన్లో నిలబడి, ఎండల్లో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

cm jagan : జూన్ 4న నేను చెయ్యబోయే మొదటి సంతకం దానిపైనే - సీఎం జగన్
X

న్యూస్ లైన్, నాయుడుపేట: రాష్ట్రంలో అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు ఈ నెల పెన్షన్ తీసుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతీ నెల 1 వ తేదీ రాగానే వాలంటీర్లు ఇంటికి వచ్చి మరీ ఇచ్చే పెన్షన్స్, ఇప్పుడు క్యూ లైన్లో నిలబడి, ఎండల్లో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వృద్దులు వడదెబ్బ తాకిడికి ప్రాణాలను విడిచిన ఘటనలు గడిచిన రెండు మూడు రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే సీఎం జగన్ నేడు తిరుపతి జిల్లా 'మేమంతా సిద్దమే' పర్యటనలో భాగంగా, నాయుడుపేట లో వాలంటీర్ వ్యవస్థ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ 'చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల సేవలను అడ్డుకుంటున్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు, వారిలో వృద్దులు, వితంతువులు, వికలాంగులు ఉన్నారు. వాళ్లందరికీ మొన్నటి వరకు వాలంటీర్లు ఇంటి వద్దకి వచ్చి పెన్షన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. జూన్ 4 వ తేదీన మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నా మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను పునః ప్రారంభించడం పైనే చేస్తాను' అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

Tags:
Next Story
Share it