CM jagan:సీఎం జగన్ భారతీల పెళ్లి వారు పుట్టకముందే కుదిర్చారట..!

ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి  డైనమిక్ ముఖ్యమంత్రుల్లో సీఎం జగన్ కూడా ఒకరు.

CM jagan:సీఎం జగన్ భారతీల పెళ్లి వారు పుట్టకముందే కుదిర్చారట..!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి డైనమిక్ ముఖ్యమంత్రుల్లో సీఎం జగన్ కూడా ఒకరు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా అయ్యారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇక ఆయన రాజకీయ విషయాన్ని మనం పక్కన పెడితే..

సీఎం జగన్ భారతీని వివాహం చేసుకొని చాలా హ్యాపీ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి అలాంటి జగన్ మరియు భారతీ వివాహం వెనుక ఒక పెద్ద స్టోరీయే ఉందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. జగన్ భారతీల వివాహం వారి పుట్టకముందే కుదిరిందట. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంబిబిఎస్ చదువుతున్న సమయంలో భారతీ తల్లి సుగుణ, వైయస్ రాజశేఖర్ రెడ్డి క్లాస్మేట్ అంట.

వీరిద్దరూ పులివెందులకు చెందిన వారే కావడంతో రాజశేఖర్ రెడ్డిని సుగుణ ఎప్పుడూ అన్నయ్య అని పిలిచేదట. వీరిద్దరి బంధం సొంత అన్నాచెల్లెళ్ల కొనసాగిందట. వీరిద్దరు చదువుకునే రోజుల్లో అన్నయ్య నాకు కూతురు పుట్టి, నీకు కొడుకు పుడితే నా కూతుర్ని నీ కొడుక్కే ఇస్తానని తరచు అనేదట. రాజశేఖర్ రెడ్డి కూడా దానికి ఓకే అనేవారట. వారు అనుకున్న విధంగానే రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి, సుగుణకు భారతి జన్మించారు.

వీరిద్దరూ పెద్దయ్యాక వాళ్లు చదువుకునే రోజుల్లో ఏదైతే అనుకున్నారో, ఆ విధంగానే జగన్ మరియు భారతీల వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉంటే, వైయస్ భారతి బిజినెస్ లలో రాణిస్తోంది.

Tags:
Next Story
Share it