cm jagan : 18 నుండి నెల్లూరు లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం!

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు ఎంత ఉత్కంఠ నడుమ సాగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. సీఎం జగన్ ఎప్పటిలాగానే ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేస్తుండగా, పవన్ కళ్యాణ్ , చంద్రబాబు బీజేపీ ని వెంటబెట్టుకొని కూటమిగా పోటీ చేస్తున్నారు.

cm jagan : 18 నుండి నెల్లూరు లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం!
X

న్యూస్ లైన్, నెల్లూరు : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు ఎంత ఉత్కంఠ నడుమ సాగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. సీఎం జగన్ ఎప్పటిలాగానే ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేస్తుండగా, పవన్ కళ్యాణ్ , చంద్రబాబు బీజేపీ ని వెంటబెట్టుకొని కూటమిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు, లేదా రేపటి లోపు రానున్న ఈ నేపథ్యం లో సీఎం జగన్ సోమవారం నుండి ఇచ్చాపురం లో ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. అదే రోజున ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఒక భారీ బహిరంగ సభ, లేక రోడ్ షో ఉండేలా వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు మొత్తం ఇప్పుడు టీడీపీ కి మారిపోయిన సంగతి తెలిసిందే. నెల్లూరు రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇప్పుడు టీడీపీ లోనే ఉన్నారు.

Tags:
Next Story
Share it