cm jagan : ఈ నెల 16 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం మొదలు!

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల రణరంగం వాతావరణం అలుముకుంది. ఎక్కడ చూసిన రాజకీయ పార్టీ నేతల సందడి తో హోరాహోరీగా తలపడేందుకు ఎవరి వ్యూహాలతో వాళ్ళు ముందుకు పోతున్నారు. అయితే ఈ ఎన్నికలలో సీఎం జగన్ ఒక్కడు ఒక వైపు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మరోవైపు.

cm jagan : ఈ నెల 16 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం మొదలు!
X

న్యూస్ లైన్, అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల రణరంగం వాతావరణం అలుముకుంది. ఎక్కడ చూసిన రాజకీయ పార్టీ నేతల సందడి తో హోరాహోరీగా తలపడేందుకు ఎవరి వ్యూహాలతో వాళ్ళు ముందుకు పోతున్నారు. అయితే ఈ ఎన్నికలలో సీఎం జగన్ ఒక్కడు ఒక వైపు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మరోవైపు. జగన్ ఒంటరిగా ఒంటి చేతితో ప్రత్యర్థుల సమూహం మొత్తాన్ని కూల్చేస్తారా?, లేకపోతే ప్రత్యర్థి సమూహమే గెలుస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పటికే సీఎం జగన్ తలపెట్టిన సిద్ధం సభలకు జనం నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రేపు అద్దంకి లో భారీ బహిరంగ సభని ఏర్పాటు చెయ్యనున్నారు. ఈ సభ కి 20 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున, మార్చి 16 వ తారీఖు నుండి సీఎం జగన్ ఎన్నికల క్యాంపైన్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయి. ప్రతీ నియోజకవర్గం లోను రోడ్ షోస్ తో పాటు, బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.

Tags:
Next Story
Share it