Cm jagan : కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. నేటి నుంచి రైతు భరోసా

ఇవాళ రైతులకు రైతు భరోసా అందించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం

Cm jagan :   కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. నేటి నుంచి రైతు భరోసా
X

Cm jagan : ఏపీలోని కౌలు రైతులకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇవాళ రైతులకు రైతు భరోసా అందించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. కౌలు రైతులతో పాటుగా దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది.

పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు దారులు, దేవాదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ. 7,500 చొప్పున రూ. 109.74 కోట్లు సాయం పంపిణీ చేయనున్నారు. కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవాదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అందజేస్తుంది.

Tags:
Next Story
Share it