CM JAGAN : ఏపీ కౌలు రైతులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త

ఏపీ కౌలు రైతులకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ కౌలు రైతులకు రైతు భరోసా నిధులను

CM JAGAN : ఏపీ కౌలు రైతులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త
X

CM JAGAN : ఏపీ కౌలు రైతులకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ కౌలు రైతులకు రైతు భరోసా నిధులను అందిచనుంది జగన్‌ సర్కార్‌. ఇందులో భాగంగానే... రైతుల ఖాతాల్లో వర్చువల్ గా నగదు జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా అందనుంది ఈ ఆర్థిక సాయం. రైతు భరోసా కార్యక్రమంతో ఏకంగా 1,46,324 మంది రైతులకు లబ్ది చేకూరనుంది. రైతు భరోసా కార్యక్రమం కింద ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఆర్థిక సహాయం అందనుంది.

లబ్ధిదారుల ఖాతాల్లో 109.74 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు సీఎం జగన్. ఇక అటు VRA లకు 500 రూపాయలు డీఏ మాంజురు చేశారు సీఎం జగన్. గత ప్రభుత్వం 300 రూపాయల డీఏ రద్దు చేసింది. డీఏ పునరుద్ధరణకు విఙప్తి చేశారు వీఆర్ఏలు. దీంతో వారి అభ్యర్థనలపై స్పందించిన సీఎం జగన్‌... 300 రూపాయల డీఏను పునరుద్ధరించటమే కాకుండా 500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Tags:
Next Story
Share it