Cm Jagan : జగన్ ప్రభుత్వానికి జాతీయ స్థాయి గుర్తింపు!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న ఈ సమయం లో, వైసీపీ పార్టీ అభిమానులకు ఒక శుభవార్త వచ్చింది. ఈ శుభవార్త వైసీపీ క్యాడర్ లో ఎక్కడలేని జోష్ ని నింపింది.

Cm Jagan : జగన్ ప్రభుత్వానికి జాతీయ స్థాయి గుర్తింపు!
X

న్యూస్ లైన్ డెస్క్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న ఈ సమయం లో, వైసీపీ పార్టీ అభిమానులకు ఒక శుభవార్త వచ్చింది. ఈ శుభవార్త వైసీపీ క్యాడర్ లో ఎక్కడలేని జోష్ ని నింపింది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు జగన్ పై 24 గంటలు అసత్య ప్రచారాలు చేస్తూ ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తుంటే, మరోపక్క జగన్ సుపరిపాలనకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టి రీతిలో పాలనా సంస్కరణలు చేపట్టి ప్రర్భుత్వాన్ని ప్రజల చెంతకు చేర్చిన సీఎం జగన్ ని కొనియాడుతూ స్కార్చ్ సంస్థ 'స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2023' లో ఆంధ్ర ప్రదేశ్ ని మూడవ స్థానంలోకి చేర్చింది.

రాష్ట్రంలోని ప్రతీ ఊరులో గ్రామ సచివాలయాలు,వాలంటీర్లు,ఇంటివద్దకు రేషన్,పెన్షన్ ఇలాంటి అద్భుత విధానాలతో సీఎం వైయస్ జగన్ ప్రతి ఇంటికి బంధువయ్యారు. ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఈ నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది. గతంలో 'స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్' ఆంధ్ర ప్రదేశ్ నాల్గవ స్థానం లో ఉండేది, ఇప్పుడు మూడవ స్థానానికి చేరుకుంది.





దక్షిణాదిలో ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే :

స్కోచ్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రం కూడా తొలి ఐదు స్థానాల్లో నిలవలేదు. మొదటి స్థానంలో ఒడిశా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర, ఐదో స్థానంలో గుజరాత్ నిలిచాయి. ఇకపోతే కీలక సమయం లో జగన్ ప్రభుత్వం కి దక్కిన ఈ అరుదైన గౌరవం ని ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంతకు ముందు వారిలో కలిసిపోతే చేస్తే కచ్చితంగా గెలుస్తాము అనే నమ్మకం ఉండేది, ఇప్పుడు జగన్ కి దక్కుతున్న ఈ ఆదరణ చూస్తూ ఉంటే కలిసి పోటీ చేసినా ఇక లాభం లేదనే భయం వారిలో మొదలైంది అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Tags:
Next Story
Share it