Cm Jagan : వైసీపీ పాలనకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు : సీఎం జగన్

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నేడు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి వాలంటీర్లకు ఘనంగా సత్కారం చేసారు. గడిచిన 5 ఏళ్లలో ఏపీ లో వాలంటీర్ల వ్యవస్థ సమాజం లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో మనమంతా గమనిస్తూనే ఉన్నాం.

Cm Jagan : వైసీపీ పాలనకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు : సీఎం జగన్
X

న్యూస్ లైన్, గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నేడు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి వాలంటీర్లకు ఘనంగా సత్కారం చేసారు. గడిచిన 5 ఏళ్లలో ఏపీ లో వాలంటీర్ల వ్యవస్థ సమాజం లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో మనమంతా గమనిస్తూనే ఉన్నాం. ముసలి అవ్వలకు, తాతలకు పింఛన్ల కోసం గంటల తరబడి క్యూలో నిల్చొని ఎదురు చూడాల్సిన పరిస్థితి నుండి, వాలంటీర్ల చేత ఇంటికి వచ్చి తలుపుతట్టి ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ని ఆదర్శంగా తీసుకొని, వారి ప్రభుత్వాలలో కూడా ఈ వ్యవస్థని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే అందంతా సీఎం జగన్ చలవే. ఇక సీఎం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా, ప్రభుత్వం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పని చేసిన వాలంటీర్లను నేడు సీఎం జగన్ ఘనంగా సత్కరించాడు. బాగా పని చేసిన వాలంటీర్లను ఎంపిక చేసి వారిఇకి 10 వేల నుండి 30 వేల రూపాయిల వరకు నగదు ని బహుమతిగా ఇచ్చాడు.

ఈ సందర్భంగా వాలంటీర్ల గురించి సీఎం జగన్ మాట్లాడుతూ 'వైసీపీ పాలనకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు. 58 నెలలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడం లో ఎలాంటి అలుపు లేకుండా పని చేసారు. అంతే కాకుండా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా, ఎంతో నిజాయితీగా పనిచేసారు. మీరంతా వాలంటీర్లు కాదు, సేవా హృదయులు. ఈ రాష్ట్రం లో నేడు రెండు లక్షల 60 వేల మంది ఉన్నారు. వీళ్లంతా నా సైన్యం. గడిచిన ఐదేళ్ళలో స్థానిక, ఉప ఎన్నికలలో వైసీపీ పార్టీ విజయ దుంధిబి మోగించింది అంటే, అందుకు కారణం వాలంటీర్లు' అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

Tags:
Next Story
Share it