RTC : APలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం?

ఏపీ మహిళలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు

RTC : APలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం?
X

APలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం?RTC : ఏపీ మహిళలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన నేపథ్యంలో... అలాంటి పథకంపై సీఎం జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

జనవరి ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారట.

ఈ పథకం అమలు తో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి... అసలు సక్సెస్ అవుతామా ? లేదా ? అనే దానిపై దిశ నిర్దేశం చేశారట. ఇక అన్ని ఓకే అయితే... జనవరి ఒకటో తేదీ నుంచి మహిళలకు ఈ సదుపాయాన్ని కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags:
Next Story
Share it