Cm Jagan : ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్ భేటీ!

ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యేందుకు సీఎం జగన్ ఢిల్లీ కి పయనమైన సంగతి మన అందరికీ తెలిసిందే. నేడు ఆయన పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయం లో మోడీ తో సమావేశం అయ్యేందుకు పార్లమెంట్ కి చేరుకున్నాడు.

Cm Jagan : ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్ భేటీ!
X

న్యూస్ లైన్, న్యూ ఢిల్లీ: ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యేందుకు సీఎం జగన్ ఢిల్లీ కి పయనమైన సంగతి మన అందరికీ తెలిసిందే. నేడు ఆయన పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయం లో మోడీ తో సమావేశం అయ్యేందుకు పార్లమెంట్ కి చేరుకున్నాడు. అనంతరం ప్రధాని కార్యాలయం లో సుమారు గంటన్నర సేపు మోడీతో చర్చ కొనసాగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ లో ఉన్న బకాయిలు గురించి చర్చించాడట. చంద్రబాబు కూడా రెండు రోజుల నుండి బీజేపీ తో పొత్తు గురించి మాట్లాడేందుకు ఢిల్లీలోనే బస చేస్తున్న సంగతి తెలిసిందే. అమిత్ షా అపాయింట్మెంట్ దొరికింది కానీ, ప్రధాని మోడీ అపాయింట్మెంట్ మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు.

కానీ సీఎం జగన్ కి మాత్రం అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి నేరుగా పార్లమెంట్ ప్రధాని కార్యాలయానికి జగన్ ని పిలిచారంటే ఆయన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడో అర్థం అయ్యింది. జరుగుతున్న ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే అసలు బీజేపీ కి టీడీపీ - జనసేనతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం ఉన్నట్టా లేనట్టా?, అనే సందేహాలు ఇరువురి పార్టీల కార్యకర్తల్లో కలుగుతున్నాయి.

Tags:
Next Story
Share it