CM Jagan : మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉదారత..80 శాతం పరిహారం

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఓ బోట్ లో ఒక్కసారిగా మంటలు చిలరేగాయి. ఆ మంటలు

CM Jagan : మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉదారత..80 శాతం పరిహారం
X

CM Jagan : విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఓ బోట్ లో ఒక్కసారిగా మంటలు చిలరేగాయి. ఆ మంటలు కాస్త దాదాపు 60 బోట్లను దగ్ధం చేశాయి. ఇక ఈ ప్రమాద సంఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. కానీ అప్పటికే భారీగా ఆస్తి నష్టం జరిగింది.

ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్... మత్స్యకారుల పట్ల తన ఉదారత చాటుకున్నారు. విశాఖపట్నం అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం జగన్. బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల జీవితాలను నిలబెట్టేలా సహాయం చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

Tags:
Next Story
Share it