Siddham : టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ చురకలు!

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందే రాజకీయాలు వేడెక్కాయి. సీఎం జగన్ ని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు మొత్తం ఏకం అయ్యాయి.

Siddham : టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ చురకలు!
X

న్యూస్ లైన్, రాప్తాడు: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందే రాజకీయాలు వేడెక్కాయి. సీఎం జగన్ ని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు మొత్తం ఏకం అయ్యాయి. ఒకపక్క సీఎం జగన్ విడతల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ ముందుకు దూసుకుపోతుంటే, మరో పక్క టీడీపీ - జనసేన సీట్ల సర్దుబాటు విషయం లో ఇంకా గందరగోళం పరిస్థితి లో ఉంది. అంతే కాకుండా సీఎం జగన్ 'సిద్ధం' సభలతో జనల దృష్టిని మొత్తం తనవైపుకు మరలించేలా చేసుకున్నాడు. ముఖ్యంగా ప్రతిపక్షాలపై ఆయన సంధిస్తున్న విమర్శనాస్త్రాలు బాగా పేలుతున్నాయి. నేడు చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి సీఎం జగన్ ఇచ్చిన స్లోగన్ ఇప్పుడు సోషల్ మీడియా లో వ్విరల్ గా మారింది. రాప్తాడు 'సిద్ధం' సభలో ఆయన మాట్లాడుతూ 'ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి..సైకిల్ ఇంటి బయట ఉండాలి..కాఫీ, టీలు త్రాగే గ్లాస్ సింక్ లోనే ఉండాలి' అంటూ మాట్లాడిన ఒక మాట సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది. వైసీపీ పార్టీ అభిమానులు ఈ డైలాగ్ ని ఒక స్లోగన్ గా వాడేసుకుంటున్నారు.

Tags:
Next Story
Share it