CM JAGAN : రైలు ప్రమాద సంఘటన స్థలానికి సీఎం జగన్

విజయనగరం జిల్లాలో (vijayanagaram) రైలు ప్రమాదం (train accident) చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఇప్పటికే 14 మంది మరణించారు. అయితే.. ఈ రైలు ప్రమాద ఘటన ప్రాంతానికి

CM JAGAN : రైలు ప్రమాద సంఘటన స్థలానికి సీఎం జగన్
X

CM JAGAN : విజయనగరం జిల్లాలో (vijayanagaram) రైలు ప్రమాదం (train accident) చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఇప్పటికే 14 మంది మరణించారు. అయితే.. ఈ రైలు ప్రమాద ఘటన ప్రాంతానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు. ఇవాళ ఉదయం 11.30 కు బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్ (CM JAGAN). సీఎం జగన్‌ తో (CM JAGAN) పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్, అధికారులు సంఘటన స్థలానికి వెళ్లనున్నారు.

విజయనగరం జిల్లాలో (vijayanagaram) కంటాకపల్లి వద్ద రైలు ప్రమాద ఘటన (train accident) జరిగింది. ఇక ఈ తరుణంలోనే..ఆస్పత్రి చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ పరామర్శించనున్నారు సీఎం జగన్‌ (CM JAGAN). ఇక ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

భీమాలి దగ్గర హెలీపాడ్ సిద్ధం చేస్తున్నారు. అలమండ రైల్వే స్టేషన్ కు రోడ్డు మార్గంలో సీఎం జగన్‌ (CM JAGAN) వెళతారు. అలమండ నుంచి ప్రమాద స్థలికి చేరుకోవడానికి ప్రత్యేక కోచ్ ఏర్పాటు చేస్తోంది రైల్వేశాఖ. డీఆర్ఎం ఉపయోగించే స్పెషల్ ట్రయిన్ లో సంఘటన స్థలికి చేరుకోనున్నారు సీఎం జగన్‌ (CM JAGAN).

Tags:
Next Story
Share it