Cm Jagan: నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటించనున్న సీఎం జగన్

నేడు మేదరమెట్లలో వైసీపీ సిద్ధం 4వ సభ ఉండనుంది. ఈ సందర్భంగా నేడు సిద్ధం సభలో అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించనున్నారు సీఎం జగన్. ఇక ఇదే సభలో మేనిఫెస్టో ప్రకటించను

Cm Jagan: నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటించనున్న సీఎం జగన్
X

Cm Jagan: నేడు మేదరమెట్లలో వైసీపీ సిద్ధం 4వ సభ ఉండనుంది. ఈ సందర్భంగా నేడు సిద్ధం సభలో అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించనున్నారు సీఎం జగన్. ఇక ఇదే సభలో మేనిఫెస్టో ప్రకటించనున్నారు సీఎం జగన్. ఈ సిద్ధం సభకు 15 లక్షల మంది ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో 4500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల దారి మళ్లింపులు చేశారు అధికారులు.

నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్ళు భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుండి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డరోడ్డు మీదుగా హైదరాబాద్ కు దారి మళ్లించారు.హైదరాబాద్ వైపు నుంచి ఒంగోలు వైపుకు వచ్చు భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా దారి మళ్లించారు.

Tags:
Next Story
Share it