Kakinada : 11 మంది మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్ సిబ్బంది

కాకినాడ తీరంలో కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఈ తరుణంలోనే 11 మంది మత్స్యకారులను ప్రాణాలతో కాపాడింది కోస్ట్ గార్డ్ సిబ్బంది. ఈ సంఘటన వివరాల్లోకి

Kakinada :  11 మంది మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్ సిబ్బంది
X

Kakinada : కాకినాడ తీరంలో కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఈ తరుణంలోనే 11 మంది మత్స్యకారులను ప్రాణాలతో కాపాడింది కోస్ట్ గార్డ్ సిబ్బంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే...కాకినాడ సముద్ర జలాల్లో బోట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంజిన్ లో మంటలు భారీగా చేలరేగాయి.

అందులో వంటకు వాడే గ్యాస్ సిలిండర్లు సైతం పేలాయి. రూ. 80 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. బోటు పూర్తిగా దగ్ధమైంది. వారం కిందట సముద్రంలో బోటు వేటకు వెళ్ళింది. తుఫాను కారణంగా మచిలీపట్నం నుంచి తిరుగు ప్రయాణం అయింది. కాకినాడ చేరేందుకు ఇంకా నాలుగు గంటల సమయం ఉండగానే తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. సమాచారం అందుకొని కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. 11 మంది మత్స్యకారులను కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.

Tags:
Next Story
Share it