Ap Politics : టీడీపీ అబద్ధపు ప్రచారం పైన సామాన్యుల తిరుగుబాటు!

14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసి చెప్పుకోడానికి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశ పెట్టని చంద్రబాబు పై జనాల్లో తిరుగుబాటు తీవ్ర స్థాయికి చేరుకుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Ap Politics : టీడీపీ అబద్ధపు ప్రచారం పైన సామాన్యుల తిరుగుబాటు!
X

న్యూస్ లైన్ డెస్క్: 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసి చెప్పుకోడానికి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశ పెట్టని చంద్రబాబు పై జనాల్లో తిరుగుబాటు తీవ్ర స్థాయికి చేరుకుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు వచ్చాయంటే చాలు, ఓట్ల కోసం వరాల జల్లు కురిపించడం, ఎన్నికలు పూర్తి అయ్యాక వాటిని అమలు చెయ్యడం మర్చిపోవడం వంటివి చంద్రబాబు కి కొత్తేమి కాదు. 2014 లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేపట్టిన సంక్షేమం సూన్యం. అందుకే జనాలు తెలుగు దేశం పార్టీ ని కేవలం 23 సీట్లకు పరిమితం చేసి, వైసీపీ పార్టీ ని 151 స్థానాల్లో గెలిచేలా చేసారు. అయితే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీ పార్టీ చేపట్టిన సంక్షేమాన్ని కప్పి పుచ్చేందుకు ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో పెరుగుతున్న ఖర్చులకు మొత్తం కారణం వైసీపీ నే అని ప్రచారం చెయ్యడం ప్రారంభించారు.

అందులో భాగంగా టీడీపీ నాయకులకు ఒక చోట వైసీపీ ప్రభుత్వం చేత లబ్ది పొందిన ఓటర్ల దగ్గర తిరుగుబాటుని ఎదురుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు పెరగడం, నిత్యావసర సరుకులు పెరగడం వంటివి వాటికి కారణం వైసీపీ నే అని చేప్పే ప్రయత్నం చెయ్యగా, జనాలు మీకు మరీ అంత అమాయకులు లాగ కనిపిస్తున్నారా?, నిత్యావసర సరుకులు కేవలం మన రాష్ట్రంలోనే పెరిగాయా?, పెట్రోల్ ధరలు కూడా మన రాష్ట్రంలోనే పెరిగాయా?, ఒక్కసారి నీ ఆధార్ కార్డు తీసుకొని రా, నువ్వు ప్రభుత్వం చేత ఎంత లబ్ది పొందావో చెప్తాను అంటూ ఒక ఓటరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక బిక్క ముఖం వేసుకొని ఆ టీడీపీ నాయకులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:
Next Story
Share it