lokesh vs Posani : నారా లోకేష్‌ పై డీజీపీకి పోసాని ఫిర్యాదు

నారా లోకేష్‌ పై డీజీపీకి ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఫిర్యాదు చేశారు. అనంతరం ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్

lokesh vs Posani : నారా లోకేష్‌ పై డీజీపీకి పోసాని ఫిర్యాదు
X

Posani : నారా లోకేష్‌ పై డీజీపీకి ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఫిర్యాదు చేశారు. అనంతరం ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. నారా లోకేష్ వల్ల నాకున్న ప్రమాదాన్ని డీజీపీకి చెప్పానని...టీడీపీలో చేరమని నన్ను అడగటం, నేను నిరాకరించటం జరిగిందని పేర్కొన్నారు. దీంతో లోకేష్ ఇగో హర్ట్ అయ్యిందని.. నాకు తెలిసిన వాళ్ళు నన్ను హెచ్చరించారన్నారు.

ఈ తరుణంలోనే.. డీజీపీ దృష్టికి అన్ని విషయాలు తీసుకుని వెళ్ళానని... నాకు భద్రత కల్పిస్తానని డీజీపీ భరోసా ఇచ్చారన్నారు. రామారావునే వేసిన వాడు చంద్రబాబు...నేనెంత? అంటూ పేర్కొన్నారు. కాపు వర్గం పై ప్రేమ ఉందని చంద్రబాబు అంటున్నాడు..

నా కుటుంబం అంతా రాజకీయ సన్యాసం చేస్తున్నాం... పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేస్తాను అని చంద్రబాబు చెప్పగలడా? అంటూ నిలదీశారు. హత్య చేసే వాడు ఆధారాలు ఇస్తాడా?? రామారావుకు వెన్నుపోటు పొడిచే ముందు చంద్రబాబు చెప్పాడా?? అంటూ ప్రశ్నించారు ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి. జగన్ అంటే నాకు పిచ్చి, ప్రాణం అన్నారు ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి.

Tags:
Next Story
Share it